Choreographer Bhanu Master: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం తన కెరీర్‌లో మరిచిపోలేనిదని ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సరైనోడు’, ‘అఖండ’ చిత్రాల ప్రయాణాన్ని.. బాలయ్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్‌ను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘డూడు డూడు’తో మొదట బాలకృష్ణ ప్రాజెక్ట్‌కు దగ్గరయ్యానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినా ‘అఖండ’ కోసం మళ్లీ పిలిచినప్పుడు ఎంతో ఆనందంగా వెళ్లానన్నారు. ఆ సినిమాలో ఒకే ఒక్క డాన్స్ పాట ఉంటుందని చెప్పారు. అంత పెద్ద సినిమా, ఒక్క సాంగ్.. అదీ ట్రెండ్ సెట్టర్ కావాల్సిన బాధ్యత.. అందుకే చాలా జాగ్రత్తగా, కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు.
NTR Death Anniversary: కారణజన్ముడు, యుగ పురుషుడు.. ఎన్టీఆర్ కు ఘన నివాళి తెలిపిన సీఎం చంద్రబాబు..!
ఈ అవకాశాన్ని ఎందుకు తనకే ఇచ్చారని బోయపాటి శ్రీనును అడిగితే.. ‘సరైనోడు’లో చేసిన సాంగ్ తనకు చాలా నచ్చిందని, అదే తరహాలో డిఫరెంట్‌గా ఏదైనా చేయమని చెప్పారన్నారు. సినిమా మొదటి సాంగ్ కావడం వల్ల ప్రెజర్ ఎక్కువ ఉండేదని.. బాగా చేస్తే ప్రశంసలు, కాస్త తేడా అయితే విమర్శలు వస్తాయని అనుకొనే.. షర్ట్ మూమెంట్, బాల్ మూమెంట్ లాంటి కొత్త కాన్సెప్ట్‌లను క్రియేట్ చేశానన్నారు. బోయపాటి శీను వాటిని పూర్తిగా నమ్మి అంగీకరించారని తెలిపారు.
అలాగే బాలకృష్ణతో పనిచేసే సమయంలో సెట్స్‌లో ఉండే వాతావరణం అమేజింగ్ అని భాను మాస్టర్ చెప్పారు. బాలయ్య బాబు డాన్స్ మాస్టర్‌ను గురువు సమానంగా గౌరవిస్తారు. ఫస్ట్ స్టెప్ ముందు సెట్స్‌లో డాన్స్ మాస్టర్‌కు నమస్కారం చేసి, దండం పెట్టి, హగ్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ చూసిన వెంటనే ఆయనకు బెస్ట్ ఇవ్వాలనే ఆలోచన వస్తుందని.. ఆయన దగ్గర ‘నో’ అనేది ఉండదన్నారు. మాస్టర్, డైరెక్టర్ ఏది డిసైడ్ చేస్తే బ్లైండ్‌గా అలా ఫాలో అవుతారని అన్నారు.
AR Rahman Controversy: ఆఫర్లకు మతానికి సంబంధం ఏంటి?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!
ఇక ‘అఖండ’*లో క్యాప్ మూమెంట్, ‘జాజికాయ జాజికాయ’ పాటలో చైర్స్ తన్నే సీక్వెన్స్ లాంటి క్లిష్టమైన మూమెంట్స్‌ను కూడా బాలయ్య అద్భుతంగా చేశారని అన్నారు. “అంత వెయిట్ ఉన్న చైర్స్‌తో చేసిన డాన్స్ మూమెంట్స్ నిజంగా అన్బిలీవబుల్.. అందుకే ఆ సాంగ్స్‌కు వచ్చిన అప్రిసియేషన్ ఈ స్థాయిలో ఉందని తెలిపారు. ‘అఖండ’ సాంగ్ విజయం తనకు కన్నడ, తమిళ్ సహా ఇతర ఇండస్ట్రీల నుంచి అవకాశాలు తెచ్చిపెట్టిందని, ఒక్క పాటే తన కెరీర్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లిందని భాను మాస్టర్ స్పష్టం చేశారు.