Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
- కొడుకు బహిష్కరణ అంతా ఎన్నికల డ్రామా..
- లాలూ మాజీ కోడలు ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు..
- అన్ని తెలిసీ నా జీవితం నాశనం చేశారు..
- నన్ను ఎందుకు నిందించారు, కొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్‌లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్‌ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో సంబంధం లేదని చెప్పారు. అతను ‘‘నైతిక ప్రవర్తన ఉల్లంఘన’’ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Read Also: India China: చైనా దొంగ బుద్ధి.. ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆంక్షలకు మోకాలడ్డు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
అయితే, ఈ వ్యవహారంపై తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ భార్య ఐశ్వర్యా రాయ్ స్పందించారు. ‘‘వారిద్దరు కలిసి ఉన్నారు. వారు విడిపోలేదు, ఎన్నికలు దగ్గరపడ్డాయి, అందుకే వారు అలాంటి చర్యలు తీసుకుని డ్రామా సృష్టించారు’’ అని అన్నారు. తన జీవితం ఎందుకు నాశనం చేశారని లాలూ కుటుంబాన్ని ఆమె ప్రశ్నించింది. తాను వివాహ సమయంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. లాలూ కుటుంబం తనను కొట్టిన సమయంలో సామాజిక న్యాయం ఎక్కడి వెళ్లిందో వారిని అడగాలి అని అన్నారు. నేను చేయని తప్పులకు, వారి కొడుకు చేసిన తప్పులను దాచడానికి నన్ను నిందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అతను (తేజ్ ప్రతాప్ యాదవ్) 12 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని ఇప్పుడు అందరికి తెలిసింది. లాలూజీ, రబ్రీదేవీ లేదా తేజస్వీలకు తెలియదని మీరు అనుకుంటున్నారా..? వారు ఎల్లప్పుడు స్త్రీలను నిందిస్తుంటారు’’ అని అన్నారు. విడాకుల గురించి వారు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐశ్వర్య చెప్పారు. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన విడాకుల విషయం మీడియా ద్వారా తెలిసిందని ఆమె చెప్పింది. అన్ని తెలిసి కూడా నాతో అతడికి ఎందుకు వివాహం జరిపించారు..? నన్ను ఎందుకు కొట్టారు..? ప్రతీ దానికి ఎందుకు నన్ను నిందించారు..? అని ప్రశ్నించారు. నాకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది..? నేను పోరాటం కొనసాగిస్తాను అని అన్నారు.
#WATCH | Patna, Bihar: "… Why was my life ruined? Why was I beaten? Now they have suddenly had a social awakening. They are all together. They have not separated… The elections are near, that is why they have taken such a step and created this drama…," says RJD leader Tej… pic.twitter.com/DC2BXUdJO2
— ANI (@ANI) May 26, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!