TECNO Spark Go 3: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్నో (TECNO) మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా తన లేటెస్ట్ 4G స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. “Everyday Go-Getters” ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్ విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, ఫీల్డ్ వర్కర్ల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది.
‘Desh Jaisa Dumdaar’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ ఫోన్.. కేవలం స్టైల్‌కే కాకుండా మన్నికకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. రోజువారీ వినియోగంలో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను తట్టుకునేలా ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు టెక్నో వెల్లడించింది. దీని కోసం మొబైల్ కు IP64 రేటింగ్ అందించారు. దీంతో ధూళి, నీటి చల్లులకు ఫోన్ సురక్షితంగా ఉంటుంది. అలాగే “డ్రాప్-రెడీ డ్యూరబిలిటీ” ఫీచర్‌తో 5000mAh భారీ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో HD+ డిస్‌ప్లే తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దీనివల్ల స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉండడంతో పాటు వీడియోలు చూడడం, యాప్ నావిగేషన్ అనుభవం మెరుగవుతుంది. వివిధ ప్రాంతాల వినియోగదారుల కోసం టెక్నో తన స్వంత వాయిస్ అసిస్టెంట్ Ella AI ను అందించింది. ఇది హిందీ, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ వంటి భారతీయ ప్రాంతీయ భాషల్లో పని చేస్తుంది.
MLA Defection Case: ఇదే స్పీకర్ కు చివరి అవకాశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇంకా ఈ మొబైల్ లో ప్రత్యేకంగా చెప్పుకొనేది నో నెట్వర్క్ కమ్యూనికేషన్ 2.0 (No Network Communication 2.0) అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. సిగ్నల్ లేని లేదా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌కు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ టైటానియం గ్రే, ఇన్క్ బ్లాక్, గాలక్సీ బ్లూ, అరోరా పర్పల్ రంగుల్లో విడుదల చేశారు. 4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న ఒక్క వేరియంట్ ధర రూ. 8,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జనవరి 23 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది.
Swagat karo #SparkGo3 ka 💪
With:
📱 120Hz HD+ Smooth Display
💪 IP64 Rating
✅ 8GB* RAM + 64GB ROM
⚡ 5000mAh Battery
👉 Ella AIAt just ₹8,999!
Sale starts on Flipkart from 23rd January, 12 Noon.
Know more 👉 https://t.co/FamfE8i1ES#TECNOMobile pic.twitter.com/oyW7v0lpZD
— TECNO Mobile India (@TecnoMobileInd) January 16, 2026