Mangaluru: కర్ణాటక కోస్తా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తతెల్తాయి. బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాత మరో హత్య చోటు చేసుకుంది. వారాల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు జరగడం స్థానికంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, స్థానిక మసీదు కార్యదర్శి అయిన 42 ఏళ్ల ఇంతియాజ్ పట్టపగలు నరికి చంపబడ్డాడు.
Turkey: టర్కీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయులు ఆ దేశంపై మండిపడుతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కిష్ డ్రోన్లతో పాటు వాటిని ఆపరేట్ చేయడాని ఆ దేశ సిబ్బందిని కూడా నియమించింది. భారత్ జరిపిన దాడుల్లో డ్రోన్లతో పాటు, వాటిని ఆపరేట్ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా హతమయ్యారు. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకు వెళ్లారు.
Monsoon: సాధారణం కన్నా ముందే రుతుపవనాలు దేశంలో విస్తరిస్తున్నాయి. సాధారంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి, ఈ సారి తొందరగానే పలకరించింది. దీంతో కేరళతో పాటు పలు రాష్ట్రాలు కురుస్తున్నాయి.
Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న అనుమానిత బృందం ప్రయత్నాలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. అస్సాంలోని దక్షిణ సల్మారా మంకాచర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన బృందం చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈ రోజు తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద అనుమానిత కదలికలను గుర్తించడంతో సరిహద్దు దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి.
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
PM Modi: దేశ విభజన జరిగిన 1947లో తొలి ఉగ్రవాద దాడిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిందని, ఇప్పుటికీ భారత్ ఈ ఉగ్రవాద వికృతరూపాన్ని అనుభవిస్తోందని గుజరాత్లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అ
Jyoti Malhotra: పాకిస్తాన్ “గూఢచారి” యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. తాజాగా, ఆమె పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఏకే-47 గన్మెన్లు సెక్యూరిటీగా ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈమెతో సహా మరో 11 మందిని కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు మూడుసార్లు పాకిస్తాన్ […]
Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్‌కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Read Also: CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి […]
Bangladesh: భారత అధికారులు ఎలాంటి పత్రాలు లేని వ్యక్తుల్ని బంగ్లాదేశ్‌లోకి తోసేయడం ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే తమ సైన్యం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి సోమవారం అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) ప్రస్తుతానికి పరిస్థితిని చక్కగా నిర్వహిస్తోందని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ (MOD) డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఎండీ నజీమ్-ఉద్-దౌలా అన్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ దాడులను ‘‘ఆపరేషన్స్ రూమ్’’ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.