PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
India on Trump: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. శశిథరూర్ తీరుపై హస్తం పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా,
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
Madvi Hidma: మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా అరెస్ట్ అయ్యారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో హిడ్మాని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో హిడ్మా చాలా కీలకం. హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా. మావోయిస్ట్ గెరిల్లా వార్ఫేర్లో మాస్టర్ మైండ్‌గా చెబుతారు. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా అరెస్ట్ కావడంతో దాదాపుగా దేశంలో మావోయిజం అంతమైనట్లు భావిస్తున్నారు.
Air Chief AP Singh: ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం సత్తా చాటింది. ముఖ్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ అటాక్స్ చేసింది. అయితే, తాజాగా వైమానిక దళ అధిపతి అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ఆలస్యంపై తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.”చాలాసార్లు, ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని మాకు తెలుసు. కాలపరిమితి ఒక పెద్ద సమస్య. […]
Pakistan: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఫైజలాబాద్ డివిజన్లో 4.2 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ డివిజన్లోని ఝాంగ్ తహసీల్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.
UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది.
Kamal Haasan: భాషాభిమానానికి కర్ణాటక, తమిళనాడు పెట్టింది పేరు. అలాంటి చోట భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
Shocking news: పిల్లలు పుట్టడం లేదని, వివాదాల కారణంగా 30 ఏళ్ల వైద్యురాలిని అత్తమామలే దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను కప్పిపుచ్చడానికి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో జరిగింది. డాక్టర్ రేణుక సంతోష్ హోనకాండేని ఆమె అత్తమామలు జయశ్రీ, కామన్న హోనకాండే హత్య చేశారు. భర్త కూడా హత్యకు కుట్ర పన్నినట్లు పోలీస్ విచారణలో తేలింది.