Emmanuel Macron: 25 ఏళ్ల పెద్దదైన టీచర్‌తో ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రేమ పెళ్లి.. భార్య కూతురు మక్రాన్ క్లాస్ మేట్..
- ఫ్రెంచ్ అధ్యక్షుడిపై చేయి చేసుకున్న భార్య ..
- ఇమ్మాన్యుయేల్ మక్రాన్-బ్రిగిట్టే లవ్ స్టోరీ..
- తన కన్నా 25 ఏళ్లు పెద్దదైన టీచర్‌తో ప్రేమాయణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmanuel Macron: వియత్నాం పర్యటనలో ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైంది. విమానం నుంచి దిగుతుండగా, అతడి భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపపై కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అంతే కాకుండా, విమానం దిగేటప్పుడు మక్రాన్ చేతిని బ్రిగిట్టే పట్టుకునేందుకు నిరాకరించింది. విమానంలో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య తగాదా జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Maoist’s Letter: నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ..
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
తన కన్నా పెద్దదైన 24 ఏళ్ల టీచర్‌తో ప్రేమాయణం:
అయితే, సంఘటన తర్వాత వీరిద్దరి ప్రేమ కథపై పలువురు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్ తన 15 ఏళ్ల వయసులోనే తన కన్నా 25 ఏళ్ల పెద్దదైన బ్రిగిట్టే ట్రోగ్న్యూక్స్‌తో ప్రేమలో పడ్డాడు. డ్రామా టీచర్ అయిన బ్రిగిట్టే డైరెక్షన్‌లో స్కూల్ డ్రామాలో మక్రాన్ ఒక పాత్ర పోషించాడు. బ్రిగిట్టే టీచర్ నుంచి పార్ట్‌నర్‌గా ఆ తర్వాత భార్యగా మారింది. 1993లో 39 ఏళ్ల వయసులో బ్రిగిట్టే, 15 ఏళ్ల మక్రాన్‌ని కలిసింది. బ్రిగిట్టే కుమార్తె మక్రాన్ క్లాస్‌మెట్ కావడం గమనార్హం.

అంతకుముందే ఆమెకు బ్యాంకర్ ఆండ్రీ లూయిస్ అజియర్‌తో వివాహమైంది. మక్రాన్ టీనేజ్‌లో ఉన్నప్పుడే బ్రిగిట్టేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మక్రాన్‌తో వివాహం కోసం బ్రిగిట్టే తన భర్త, ముగ్గురు పిల్లలతో విడిపోవాలని నిర్ణయించుకుంది. బ్రిగిట్టే తన భర్త ఆండ్రీ లూయిస్ ఆజియర్‌ను 2006లో విడాకులు తీసుకుంది. 2007లో మక్రాన్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి సమయానికి బ్రిగిట్టేకి 54 ఏళ్లు (ప్రస్తుతం 72 ఏళ్లు), మక్రాన్‌కి 29 సంవత్సరాలు(ప్రస్తుతం 47 ఏళ్లు)
ప్రస్తుతం, బ్రిగిట్టేకు ఏడుగురు మనవరాళ్లు ఉన్నారు. 2015లో, మక్రాన్ ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పారిస్‌లో అతడితో కలిసి ఉండేందుకు తన ఉద్యోగాన్ని వదులుకుంది. పలు సందర్భాల్లో మక్రాన్ మాట్లాడుతూ, తన విజయాల వెనక తన భార్య బ్రిగిట్టే ఉందని చెప్పేవారు.
అయితే, ఒక ఇంటర్వ్యూల్లో బ్రిగిట్టే కుమార్తె టిఫైన్ అజియార్ మాట్లాడుతూ, తన తల్లి తన కన్నా 25 ఏళ్లు చిన్నవాడైన విద్యార్థిని ప్రేమించడం తమకు తీవ్రంగా బాధపెట్టినట్లు చెప్పింది. ఉత్తర ఫ్రాన్స్‌లోని తమ సొంతూరిలో ఈ సంబంధం గురించి అనేక ఊహాగానాలను భరించాల్సి వచ్చిందనిచెప్పంది. ఆ సమయంలో ముగ్గురు పిల్లలమైన తమపై తీవ్ర ప్రభావం చూపినట్లు చెప్పారు. తన సోదరి లారెన్స్, మక్రాన్ క్లాస్‌మెట్స్ అని వెల్లడించింది.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!