China: విదేశీ అమ్మాయిలతో, అక్రమ వివాహాలకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, చైనా పౌరులకు సూచించింది. ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ పథకాల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. చైనా ప్రభుత్వం మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘‘క్రాస్ బోర్డర్ డేటింగ్’’కి లొంగవద్దని చైనీయులను కోరింది. అనధికారిక నెట్వర్క్స్, కమర్షియల్ మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీల ద్వారా ‘‘విదేశీ భార్యలు’’ను వెతకవద్దని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ‘‘విదేశీ భార్యల షాపింగ్’’ అనే భావనను తిరస్కరించాలని, బంగ్లాదేశ్‌లో వివాహం చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని తన పౌరుల్ని చైనా కోరింది.
Read Also: Jyoti Malhotra: “గూఢచారి” జ్యోతి మల్హోత్రాకి పాక్‌లో ఆరుగురు గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. వీడియో వైరల్..
చైనాలో వధువు అక్రమ రవాణా పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆ దేశం ఈ హెచ్చరికల్ని చేసింది. చైనాలో ఒకే బిడ్డ విధానం, కొడుకుల పట్ల ఉన్న వ్యామోహం కారణంగా లింగ అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. సుమారుగా చైనాలో 3 కోట్ల మంది పురుషులు భార్యల కోసం వెతుకుతున్నారు. దీంతో విదేశీ వధువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని నివేదికల ప్రకారం, బంగ్లాదేశ్ మహిళల్ని వివాహం పేరుతో చైనాలో విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ముఠాలు ఈ అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ వివాహాల్లో చాలా వరకు చట్టవిరుద్ధమైన, దోపిడీ మార్గాల ద్వారా ఏర్పాటు చేసినవి, ఇది తీవ్రమైన చట్ట ఉల్లంఘనకు దారి తీయవచ్చని చైనా రాయబార కార్యలయం హెచ్చరించింది.
చైనా చట్టాల ప్రకారం, మ్యారేజ్ ఏజెన్సీలు సరిహద్దు దాటి పెళ్లి సంబంధాలను కుదుర్చడం, వాటిని దాచి పెట్టడం వంటివి నిషేధించబడ్డాయి. ప్రేమ, లేదా వివాహ మోసాల బాధితులు వెంటనే చైనా పబ్లిక్ సెక్యూరిటీ అధికారులను కలవాలని రాయబార కార్యాలయం కోరింది. బంగ్లాదేశ్ మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం, మానవ అక్రమ రవాణా నిర్వాహకులు కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటారు, జీవిత ఖైదు లేదా మరణశిక్ష వరకు శిక్షలు విధించబడతాయి. అక్రమ రవాణాను ప్రేరేపించే, ప్లాన్ చేసే లేదా సహాయం చేసే వారికి మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 20,000 టాకా ($185) వరకు జరిమానా విధించవచ్చు.