India China: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది.
Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
Vivek Ramaswamy: భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి […]
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
R-37M missile: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా, భారత్‌కి డెడ్లీ మిస్సైల్‌ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా తన లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ని కూడా అందిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు R-37M హైపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ వద్ద ఉన్న Su-30MKI ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చాలనే ఆలోచన దీని వెనక ఉన్నట్లు తెలుస్తోంది.
Jodha-Akbar: బ్రిటీష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా భారతదేశ చరిత్రలో అనేక తప్పులు నమోదయ్యాయని రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే అన్నారు. బుధవారం, ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..జోధాబాయి, మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి వివాహం వివాహం కూడా అబద్ధమే అని అన్నారు. అక్బర్నామా గ్రంథంలో ఎక్కడా కూడా వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.
Mangaluru Murder: కర్ణాటక కోస్తా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య జరిగింది. దీని తర్వాత, తాజాగా సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, కోల్తమజలు జుమ్మా మసీదు కార్యదర్శి 32 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పట్టపగలు నరికి చంపబడ్డాడు. ఈ దాడిలో అతడి సహచరుడు కలందర్ షఫీ (29) తీవ్ర గాయాలపాలయ్యారు.
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్ […]