Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.
Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్నారీ కుమారుడు అబ్బాస్ అన్సారీని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఉత్తర్ ప్రదేశ్ మౌ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్‌కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, అతడి ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. 2022లో అధికారులను బెదిరిస్తూ ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీని కూడా దోషిగా తేల్చింది, ఇతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.…
Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత మరో బిడ్డకు తండ్రి అయినట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ ఒక జపనీస్ పాప్ స్టార్‌తో బిడ్డను కన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఎలాన్ మస్క్‌తో రోములస్ అనే కొడుకును కన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆష్లే సెయింట్ క్లైర్(26) ఈ ఆరోపణలు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్(NYT) మరో కొత్త కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని ఎయిర్ నష్టాలను చవిచూసినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ శనివారం అంగీకరించారు. అయితే, భారత్‌కి చెందిన 6 ఫైటర్ జెట్స్‌ని కూల్చేశామనే పాకిస్తాన్ వాదనల్ని మాత్రం ఆయన తిరస్కరించారు. అవి పూర్తిగా తప్పు అని చెప్పారు. తొలిసారిగా, సైన్యం భారత్ కొన్ని విమానాలు కోల్పోయినట్లు ధ్రువీకరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణల్లో మొదటి రోజు ఎయిర్ నష్టాలను చవిచూసిన తర్వాత భారత్ తన వ్యూహాలను మార్చుకుందని,
Congress: ప్రధాని నరేంద్రమోడీని అవమానించే విధంగా కేరళ కాంగ్రెస్ యూనిట్ ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అనే ట్యాగ్‌లైన్‌తో చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొత్త వివాదానికి కారణమైంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసియబడిన ఈ పోస్ట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తోంది, అగౌరవపరుస్తోందని, బుజ్జగింపు రాజకీయాల్లో పాల్గొంటోందని కేరళ బీజేపీ, కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించింది.
Baloch Liberation Army: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బలూచ్ ఆర్మీ కంట్రోల్ పెరిగింది. క్వెట్టా వంటి రాజధాని మినహా చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టు లేదు. ఇప్పటికే, పాక్ ఆర్మీ టార్గెట్‌గా బీఎల్ఏ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, కీలకమైన సురబ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ యోధులు ప్రకటించారు. నగరంలో అనేక పోలీస్ స్టేషన్లు, […]
Global Optimism Index: జాతీయ ఆశావాదంలో భారతదేశం ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వార భారతీయల్లో ఆశావాద దృక్పథం పెరిగిందని ఇప్సోస్ ‘‘వాట్ వర్రీస్ ది వరల్డ్’’ సర్వే చెప్పింది. మే 2025 ఎడిషన్‌లో భారత్ మూడు శాతం పాయింట్లు ఎగబాకి జాతీయ ఆశావాదంలో గణనీయమైన పెరుగుదల నివేదించినట్లు చెప్పింది. ప్రపంచంలోనే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా తర్వాత ‘‘గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్’’లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ […]
Shahid Afridi: దుబాయ్‌లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.