బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ భామ.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సారా అర్జున్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను బయట పెట్టింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే అత్యంత ఇష్టమని, ఆయనే తన ఫేవరేట్ నటుడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read : Kiccha Sudeep : కిచ్చా సుదీప్ ‘మార్క్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సారా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కూడా ఆయన ఫ్యాన్ అని చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సారా నటిస్తున్న ‘యుఫోరియా’ సినిమా ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది. యూత్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంతో సారా టాలీవుడ్‌లో పాగా వేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవిష్యత్తులో తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సారా అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి.