India China: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది.
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. భారత్ పేలని PL-15Eని స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇది రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, చైనా తయారు చేసిన అత్యంత అధునాతన రాకెట్ అని చెబుతుంటారు. ‘‘మీరు పేర్కొన్న క్షిపణి ఎగుమతి చేసిన పరికరం. స్వదేశంలో, విదేశాల్లో రక్షణ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రదర్శించబడింది’’ అని జాంగ్ అన్నారు. మే 7-10 మధ్య జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
Read Also: Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..
భారత్, పాకిస్తాన్‌లు తొలగించలేని పొరుగు దేశాలని, పాకిస్తాన్‌కి వైమానిక రక్షణ, ఉపగ్రహ మద్దతు అందించిందని, చైనా ఆయుధ వ్యవస్థ సగటు కన్నా తక్కువగా పనిచేస్తుందని భారత అధికారుల చేస్తున్న వాదనల్ని జాంగ్ తిరస్కరించారు. చైనా ఆయుధాలను తొలిసారిగా పాకిస్తాన్ సంఘర్షణలో ఉపయోగించడాన్ని ఆ దేశం కీలకంగా గమనించింది. అయితే, భారత్ పాక్ ఉపయోగించిన చైనా వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దేశానికి చెందిన రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని మన మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి.
మరోవైపు, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవలి నివేదిక ప్రకారం, 2020 నుండి 2024 వరకు చైనా యొక్క అన్ని వాతావరణ మిత్రదేశమైన ఆయుధాల కొనుగోలులో 81 శాతం వాటాను కలిగి ఉన్న చైనా పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా అవతరించింది. కొనుగోలులో తాజా జెట్ ఫైటర్లు, రాడార్లు, నావికా నౌకలు, జలాంతర్గాములు మరియు క్షిపణులు ఉన్నాయి. రెండు దేశాలు సంయుక్తంగా పాకిస్తాన్ వైమానిక దళం (PAF)కి ప్రధానమైన J-17 విమానాలను తయారు చేశాయి.