Vivek Ramaswamy: భారత సంతతి ఎంటర్‌ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి డేట్ సమయంలోది కాగా, మరొకటి ఇద్దరు ఇటీవల విహారయాత్రలో ఉన్న సమయంలోనిది. 2011లో తాను తెలివైన వైద్య విద్యార్థిని కలిశానని, ఆ తర్వాత రాకీ పర్వతాల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లినట్లు చెప్పాడు. 14 సంవత్సరాలు పరిచయం, ఇద్దరు పిల్లల తర్వాత, ఈ వారాంతంలో మా 10 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు రామస్వామ రాశారు.
Read Also: Pakistan: ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు.. పాక్ టెర్రర్ లింకులు బహిర్గతం..
అయితే, అమెరికాలో H-1B వీసా ప్రోగ్రామ్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య వీరిని టార్గెట్ చేస్తూ జాత్యహంకార పోస్టులు పెట్టారు. చాలా మంది యూజర్లు ‘‘గో బ్యాక్ ఇండియా’’ అంటూ భారత్ వెళ్లిపోవాలని కామెంట్స్ చేశారు. “దయచేసి మీరు భారతదేశానికి తిరిగి వెళ్లి అక్కడ హైకింగ్ ట్రైల్స్‌ను అన్వేషించించండి” అని, మరో యూజర్ “మీ స్వదేశంలో మీకు పర్వతాలు లేవా?” అని రాశారు. “మిమ్మల్ని బహిష్కరించాలి” అని మూడో నెటిజన్ అన్నారు. మరొకరు ‘‘మీరు 3-4 లైటర్ షేడ్స్‌తో కనిపిస్తున్నారు. మీరు మీ చర్మాన్ని బ్లీచ్ చేయలేదు అవునా..?’’ అని కామెంట్ చేశారు.
H-1B వీసా ప్రోగ్రామ్‌ని వివేక్ బహిరంగంగా వ్యతిరేకించినప్పికీ, భారతీయ గుర్తింపు కారణంగా ఆయన అనుకూలంగా ఉన్నారని కొందరు ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షడైనప్పటి నుంచి H-1B వీసా, అమెరికన్ పౌరులకు ఉద్యోగాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ వీసాపై వచ్చినవారు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ట్రంప్ మాత్రం ప్రతిభావంతులైన వారు అమెరికాకు అవసరం అని వారికి H-1B వీసాలు ఇవ్వడం మంచిదే అని చెబుతున్నారు.
In the fall of 2011, I met a brilliant medical student named Apoorva & asked her out on a first date – to head west for a weekend & hike Flattop Mountain in the Rockies. She accepted. We got within striking distance of the summit when a blizzard hit. I was foolishly stubborn… pic.twitter.com/pdV1joMUeg
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 26, 2025