Murshidabad Riots: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ‘‘వక్ఫ్ చట్టానికి’’ వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఆందోళన నిర్వహించిన ముస్లిం గ్రూపులో కొందరు వ్యక్తులు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. హిందువుల ఆస్తులపై దాడులు చేశారు.
India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం ఘటన జరిగింది. నగరంలోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. శంకర్ అనే నిందితుడు 26 ఏళ్ల తన భార్య మానస వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఈ భయానక చర్యకు పాల్పడ్డాడు.
Israel Hamas War: అక్టోబర్ 07, 2023లో ఏ క్షణాల హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేశారో అప్పటి నుంచి ఆ ఉగ్రసంస్థతో పాటు గాజాలోని ప్రజలు జీవితం దుర్భరంగా మారింది. గత ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయిల్ హమాస్ అంతం కోసం గాజాపై దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అక్టోబర్ 07 నాటి దాడుల్లో 1200 మందిని హతమార్చడంతో పాటు 250 మందిని బందీలుగా గాజా స్ట్రిప్‌లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం […]
Madhavi Latha: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ వంతెన దేశాన్ని మొత్తం జమ్మూ కాశ్మీర్‌తో అనుసంధానిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఒక మహిళా ప్రొఫెసర్ జి మాధవి లత కృషిని అంతా కొనియాడుతున్నారు. 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని వంతెన నిర్మాణానికి ధారపోశారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు.
Russia: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిల్లు’’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యన్ శాసన సభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారంటూ ఆయన ఎక్స్‌లో రాశారు. ఈ ఏడాది జరగబోయే బీహార్ ఎన్నికల్లో కడా బీజేపీ రిగ్గింగ్ చేయాలని చూసతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే మహారాష్ట్ర మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, ఆపై బీజేపీ ఓడిపోయే చోట రిగ్గింగ్ చేస్తుంది’’ అని ఆయన రాశారు.
Maulana Abdul Aziz: పాకిస్తాన్లో వరసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.