Pakistan: పాకిస్తాన్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలు ఆయుధాలతో పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించింది. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఇది ఆ ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు.
Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133.
Shashi Tharoor: పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో సమావేశమైంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్’’పై ఇరువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్ ఎలాన్ మస్క్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద బిల్లుకు ఓటు వేసే రిపబ్లిక్లను శిక్షించడానికి ప్రయత్నిస్తే ‘‘తీవ్ర పరిణామాలు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం బెదిరించారు.
G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు.
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Trump New Bill: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ECI: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన […]