Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్‌ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు, […]
Sharmistha Panoli: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివాదాస్పద పోస్ట్ పెట్టిన తర్వాత, ఇన్ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనే ఆరోపణలపై ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పనోలికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జూన్ 04న సాయంత్రం 4.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతోంది. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్తాన్‌పై దాడి తర్వాత తొలిసారిగా ప్రధాని మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Pakistan: ప్రపంచానికి చీడ పురుగుగా పాకిస్తాన్ మారింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా, దాని మూలాలు పాకిస్తాన్లో కనిపిస్తాయి. అల్ ఖైదాతో పాటు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా అనేక ఉగ్రవాద సంస్థలకు పాక్ గడ్డపై నుంచి కార్యకలాపాలకు పాల్పడుతుంటాయి. ఇండియాపైకి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్నాయి. ఒక్క భారతదేశం మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నారు. Read Also: Drug Peddlers Arrested: కూకట్‌పల్లిలో డ్రగ్స్.. ఏపీకి చెందిన […]
Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది దశకు చేరుకుంది. మంగళవారం, ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఫైనల్‌పై రాజకీయం మొదలైంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కోల్‌కతా నుంచి గుజరాత్‌కి మార్చాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం ఆదివారం విమర్శించింది.
Thug Life: కమల్ హాసన్ తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కామెంట్స్ చేయడం వివాదానికి కారణమైంది. కర్ణాటకలోని ప్రజలు, పలు సంఘాలు కమల్ హాసన్ తీరును తప్పుపట్టాయి. ఆయన సినిమా విడుదలకు అనుమతించబోమని హెచ్చరించాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే, ఆయన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదలకు అనుమతించబోమని కర్ణాటక ఫిలిం బాడీ హెచ్చరించింది. “ఆయన క్షమాపణ చెప్పకపోతే, థగ్ […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్‌కి రుచి చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత,
India: భారతదేశ రక్షణరంగ ఉత్పత్తులు 2024-25(FY25)లో ఆల్ టైమ్ రికార్డ్‌కి చేరుకున్నాయి. ఏకంగా 1.46 ట్రిలియన్లకు చేరుకున్నట్లు, ఇది 2024 ఆర్థిక సంవత్సరం(FY24)తో పోలిస్తే రూ. 1.27 ట్రిలియన్ల నుంచి దాదాపుగా 15 శాతం పెరిగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయని వెల్లడించారు. FY24లో రూ.21,083 కోట్ల నుండి ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగాయని ఆయన అన్నారు.