Bengaluru: బెంగళూర్‌లో దారుణం ఘటన జరిగింది. నగరంలోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. శంకర్ అనే నిందితుడు 26 ఏళ్ల తన భార్య మానస వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఈ భయానక చర్యకు పాల్పడ్డాడు.
Read Also: Israel Hamas War: చక్కెర రూ. 5000, ఆయిల్ రూ. 4000.. దుర్భరంగా గాజా ప్రజల పరిస్థితి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్, మానస దంపతులు కొంతకాలం క్రితం హీలలిగే గ్రామంలో అద్దె ఇంటికి మారారు. జూన్ 03వ తేదీ రాత్రి, శంకర్ పనికి బయలుదేరాడు, మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పాడు, అయితే, రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, ఆ సమయంలో మానస, వేరే వ్యక్తితో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మానస ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాతి రోజు మానస చాలా సార్లు ఇంటికి తిరిగి వచ్చి శంకర్‌ని వేధించినట్లు చెబుతున్నారు.
హత్యకు ముందు రోజు రాత్రి కూడా ఆమె మళ్లీ ఇంటికి వచ్చి సీన్ క్రియేట్ చేసింది. పదేపదే వేధింపులకు గురైన శకంర్ మానస తల నిరికి, ఆపై ఆమె తలతో సూర్య నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లాడు. అక్కడే అతను లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.