OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..
GHMC ఎన్నికలపై క్యాడర్‌కు దిశానిర్దేశం
ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి కేడర్‌కి దిశా నిర్దేశం చేసింది బీజేపీ. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ వికసిస్తున్న తీరును పార్టీ నేతలు వివరించారు. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ర్ట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేశారు. అక్కడ కార్పొరేషన్లు గెలిచినందుకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోనూ సంబరాలు చేసుకున్నారు. అయితే, బీజేపీ నేతలపై ఒక విమర్శ వుంది. ఎక్కడా గెలిచిన ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే బీజేపీ…మరి ఇక్కడి కార్పొరేషన్‌లో గెలిచేదెప్పుడు అని సెటైర్లు పేలుస్తున్నారు.
గ్రేటర్‌లో బృహన్ ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
మహారాష్ట్ర ఫలితాలతో ఉప్పొంగిపోతున్న తెలంగాణ బీజేపీ నేతలు…గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయని ఢంకా బజాయిస్తున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరని అంటున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలు …మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరేనని..ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎన్నో లెక్కల్లో తలనమునకలైన కమలనాథులు…చివరికి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
READ ALSO: AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..