Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్‌ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యాలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కి సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Honour Killing: పరువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సనా యూసుఫ్‌ని బంధువు అతి దగ్గర నుంచి చంపినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం చెప్పిన దాని కన్నా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆ దేశ పత్రాలు బయటపెట్టాయి. భారత్ పేర్కొన్న దాని కన్నా అదనంగా మరో 8 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అని దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్‌కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.
Pakistan Spy: భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అరెస్ట్ చేశారు.
Pakistan: పాకిస్తాన్‌కి భారీ దెబ్బ తగిలింది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. మాలిర్ జైలు లోపల హింసాత్మక దాడి జరిగిన తర్వాత సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఖైదీలు పోలీస్ అధికారులతో ఘర్షణ పడిన తర్వాత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి. […]
Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టర్కిష్ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత, అసభ్యకరమై వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ‘‘మాలిక్ స్వాష్‌బక్లర్’’ అని పిలువబడే మాలిక్ ఎస్డీ ఖాన్, తన ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలపై విమర్శలకు గురయ్యాడు. టర్కిష్ మహిళపై లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో మాలిక్ తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి ఈ […]
US-India Trade Deal: భారత్, అమెరికా మధ్య త్వరలో ‘‘వాణిజ్య ఒప్పందం’’ ఖరారు కావచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ వారం న్యూఢిల్లీలో జరిగే భారత్-అమెరికా చర్చల చివరి రౌండ్ సమావేశాలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేసే స్థలాన్ని కనుగొన్నాము కాబట్టి, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం వస్తుందని మీరు ఆశించాలి’’ అని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (యుఎస్ఐఎస్పిఎఫ్) ఎనిమిదవ ఎడిషన్‌లో లుట్నిక్ […]
US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చర్చిస్తారని వైట్‌హౌజ్ సోమవారం తెలిపింది.