Russia: ట్రంప్‌తో వైరం, ఎలాన్ మస్క్‌కి రష్యా ఆఫర్..
- ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు..
- రష్యా రాజకీయ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశ శాసనసభ్యుడి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిల్లు’’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యన్ శాసన సభ్యుడి ఆఫర్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
రష్యన్ శాసనసభ్యుడు డిమిత్రి నోవికోవ్, మస్క్ రష్యాలో రాజకీయ ఆశ్రయం కోరవచ్చని సూచించారు. అమెరికా అధ్యక్షుడితో వివాదం నేపథ్యంలో స్టేట్ డూమా కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్) యొక్క మొదటి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి నోవికోవ్ ఈ ప్రకటన చేశారు. ‘‘ మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడుతున్నాడి, అతడికి ఎలాంటి రాజకీయ ఆశ్రయం అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే, అతను కోరితే రష్యా ఆశ్రయం అందించగలదు’’ అని ఓ వార్తా సంస్థతో చెప్పాడు. ఎడ్వర్డ్ స్నోడెన్‌కు గతంలో చేసినట్లుగానే, మస్క్‌కు ఆశ్రయం ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉందా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
Read Also: Rahul Gandhi: మహారాష్ట్ర తర్వాత, బీహార్‌లో కూడా ‘‘ఫిక్సింగ్’’ చేస్తారు.. స్పందించిన బీజేపీ..
వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్, మిస్టర్ మస్క్‌ను “ఒక అక్రమ గ్రహాంతరవాసి” అని పిలిచి, ఆయనను యునైటెడ్ స్టేట్స్ నుండి బహిష్కరించాలి” అని కోరిన తర్వాత డిమిత్రి నోవికోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ బిలియనీర్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఎలాన్ మస్క్‌ని తీవ్రంగా విమర్శించే బానన్, అతడి ఇమ్మిగ్రేషన్‌పై అధికారిక దర్యాప్తు చేయాలని, ఎందుకంటే ఆయన అక్రమంగా వచ్చినట్లు నమ్ముతున్నానని, అతడిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కోరాడు.
ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో అంతర్జాతీయ కేంద్రం (ISS)కి మరియు బయటకు వ్యోమగాములను తీసుకువెళ్ళే స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకను నిలిపేస్తానని మస్క్ బెదిరించిన తర్వాత బానన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ వెంటనే స్పేస్ ఎక్స్‌ని స్వాధీనం చేసుకునేందుకు డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టం కింద ఒక అత్యవసరం ఉతర్వు జారీ చేయాలని కోరాడు.
ఇదిలా ఉంటే, రష్యా శాసనసభ్యుడు నోవికోవ్ చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించేందుకు నిరాకరించాడు. ఇది అమెరికా అంతర్గత సమస్య అని, తాము జోక్యం చేసుకునే ఉద్దేశ్యం లేదని అన్నారు. రష్యా గతంలో యూఎస్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కి, బ్రిటన్ బ్లాగర్ గ్రాహం ఫిలిప్స్‌కి ఆశ్రయం కల్పించింది.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!