Bengaluru stampede case: బెంగళూర్‌లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది. ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ […]
Sonam Raghuvanshi: దేశవ్యాప్తంగా ‘‘హనీమూన్ మర్డర్’’ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లే కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో హతమార్చింది. ఈ కేసు తర్వాత, పెళ్లి అంటేనే మగాళ్లు భయపడేలా చేసింది. ఈ మొత్తం ప్లాన్‌ని సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా రూపొందించారు. ఆమె తన ముగ్గురు స్నేహితుల్ని కాంట్రాక్ట్ కిల్లర్స్‌గా నియమించుకుంది.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లిన 17 ఏళ్ల గిరిజన బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం సుందర్ పహారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుల్లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Padmanabhaswamy Temple: కేరళలో రాజధాని తిరువనంతపురంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత ‘‘మహా కుంభాభిషేకం’’ జరిగింది. దీంతో ఆదివారం రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ పురాతన ఆలయంలో ఇటీవల దీర్ఘకాలిక పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది.
Suhas Shetty Murder Case: గత నెలలో కర్ణాటకలోని మంగళూర్లో మాజీ భజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది.
Fact-check: ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడిని తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. 11వైమానిక స్థావరాలు , కీలక ఆయుధ వ్యవస్థలు నాశనమైనప్పటికీ తామే విజయం సాధించామంటూ ప్రగల్భాలకు పోతోంది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్నప్పటికీ, విక్టరీ ర్యాలీల పేరుతో పాకిస్తాన్‌లోని ప్రముఖులు, ఆర్మీ సంతోష పడుతోంది. అక్కడి ప్రజల్ని బకరాలను చేయడానికి ఇదంతా చేస్తోంది.
Amit Shah: తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు.
Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. 09 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, రక్తస్త్రావం అవతున్న స్థితిలో ఆమెను సూట్‌కేస్‌లో కుక్కి చంపినట్లు ఆదివారం పోలీస్ అధికారులు తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత, శనివారం సాయంత్రం నెహ్రూ విహార్‌లోని ఫ్లాట్‌లోని రెండో అంతస్తులో సూట్‌కేస్ కనిపించింది. ఇందులో బాలిక అపస్మారస్థితిలో కనిపించింది.
Pakistan: పాకిస్తాన్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలు ఆయుధాలతో పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించింది. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఇది ఆ ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.