Epstein Files: ట్రంప్‌పై “ఎప్‌స్టీన్ ఫైల్స్” పోస్ట్ డిలీట్ చేసిన మస్క్.. అసలేంటీ ఈ ‘‘సె*క్స్ స్కాండల్’’..
- ట్రంప్‌పై ‘‘ఎప్‌స్టీన్ ఫైల్స్’’ పోస్ట్ డిలీట్ చేసిన మస్క్..
- ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌లో ట్రంప్‌కి ప్రమేయం ఉందని మస్క్ ట్వీట్..
- అమెరికా రాజకీయాల్లో సంచలనంగా ఎప్ స్టీన్ ఫైల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ ఒకానొక దశలో ట్రంప్‌ని దించేసి జేడీ వాన్స్‌ని అధ్యక్షుడిని చేయాలంటూ కోరడం సంచలనంగా మారింది. దీంతో, ట్రంప్ టెస్లాకు ఇస్తున్న రాయితీలను తీసేస్తానని ప్రకటించడంతో ఇద్దరి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది.
ఇదిలా ఉంటే, అమెరికా రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసి ‘‘ఎప్‌స్టీన్ ఫైల్స్’’లో ట్రంప్ ఉన్నాడంటూ మస్క్ సంచలన పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పుడు ఆయన చేసిన పోస్టుని తొలగించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాలో లైంగిక నేరస్తుడు, ఆయన చేసిన అక్రమ కార్యకలాపాల్లో అమెరికా పెద్ద తలకాయల ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. అయితే, ట్రంప్ పేరు కూడా ఈ ఫైల్స్‌లో ఉందనే ఆ ఫైల్స్‌ని ఎప్పుడూ బహిరంగపరచలేదని మస్క్ ఆరోపించాడు. అయితే, ఇప్పుడు ఆ పోస్టును ట్రంప్ డిలీట్ చేశారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
READ ALSO: Russia: ట్రంప్‌తో వైరం, ఎలాన్ మస్క్‌కి రష్యా ఆఫర్..
అసలేమిటీ ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్?
జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనం. ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. మైనర్ బాలికలతో వ్యభిచారం నడుపుతూ, వారిని అమెరికాలోని ప్రముఖుల పక్కలోకి చేర్చారనేది ఈ ఎప్‌స్ట్రీన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో జూలై 2019లో ఎప్‌స్టీన్‌ని సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాల కింద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుంది. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల పేర్లు ఉండటంతోనే ఈ పత్రాలను బహిర్గతం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!