Murshidabad Riots: ముర్షిదాబాద్ అల్లర్లు.. తండ్రీకొడుకుల హత్యలో 13 మంది నిందితులు..
- ముర్షిదాబాద్ అల్లర్లలో తండ్రికొడుకుల హత్యపై చార్జిషీట్..
- 13 మంది నిందితుల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murshidabad Riots: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ‘‘వక్ఫ్ చట్టానికి’’ వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఆందోళన నిర్వహించిన ముస్లిం గ్రూపులో కొందరు వ్యక్తులు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. ఈ అల్లర్లపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అల్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని, అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, ముఖ్యంగా టీఎంసీ నాయకుడు మెహబూబ్ ఆలం ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా తేల్చింది.
Read Also: SVSN Varma : పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ అల్లర్లలో తండ్రీకొడుకులను హత్య చేసిన కేసులో 13 మందిపై బెంగాల్ పోలీసులు చార్జిసీట్ దాఖలు చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన మత హింసలో హరగోబిందో దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40)లను నరికి చంపారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత షంషేర్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జట్బోజా గ్రామంలోని బాధితుల ఇంటి తలుపులు పగలగొట్టి, వీరిని బయటకు లాగి పట్టపగలు నరికి చంపారు.
ఈ దాడి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత, ధులియాన్ మునిసిపాలిటీ మాజీ చైర్మన్ మెహబూబ్ ఆలంపై హైకోర్టు నిజనిర్ధారణ తేల్చింది. నిందితులపై అల్లర్లకు పాల్పడటం, బలవంతంగా ఇంట్లోకి చొరబడటం, ఐదుగురికి పైగా వ్యక్తుల బృందం హత్య చేయడం, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని అక్రమంగా కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ఏప్రిల్ 8 నుండి 12 వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు, అనేక మంది గాయపడ్డారు, వందలాది మంది తమ ఇళ్లను పొరుగున ఉన్న మాల్డా జిల్లాకు పారిపోయారు. హింసకు సంబంధించి 300 మందిని అరెస్ట్ చేశారు. ఈ హింసాకాండపై ముర్షిదాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!