Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. విమానం వేగంగా తన ఎత్తును కోల్పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం సమయంలో విమానం 825 అడుగుల నుంచి కుప్పకూలింది. విమానం […]
Air India Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని! టేకాఫ్ అయిన […]
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయి రెండు వారాలు గడవకముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ పక్కా పథకంలో హతమార్చింది. సోనమ్ ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఈ కేసులో ప్రధాన సూత్రధారులు. వీరిద్దరు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
UPI payments: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని చిన్న షాపుల్లో పేమెంట్స్‌కి కూడా గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపీఐ ఆధారిత యాప్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
US General: అమెరికాకు భారత్, పాకిస్తాన్ ఒకటే అని చెప్పకనే చెప్పింది. అమెరికు చెందిన ఒక టాప్ జనరల్ మాట్లాడుతూ.. వాషింగ్టన్కు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటానికి ఆ ప్రాంతంలో భాగస్వామిగా పాకిస్తాన్ ఖచ్చితంగా అవసరమని అన్నారు.
Tamil Nadu: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఒక ఆలయంలో అన్నదానం తర్వాత పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల 107 మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు. విరుదునగర్ జిల్లాలోని కల్విమడై గ్రామంలోని కరుప్పన్న స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. జూన్ 6 నుంచి ఆలయంలో కుంభాభిషేకం ఉత్సవంలో భాగంగా సామూహిక అన్నాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Donald Trump:వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా, చైనాల మధ్య ముందస్తుగా రేర్ ఎర్త్ మెటీరియల్, చైనా విద్యార్థులకు వీసాలపై డీల్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ట్రూత్ సోషల్ పోస్టులో.. బీజింగ్ అమెరికాకు అయస్కాంతాలు, కావాల్సిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరా చేస్తుందని, బదులుగా అమెరికా చైనీస్ స్టూడెంట్స్‌కి యూఎస్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు.
Jyoti Malhotra: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ని విచారించిన హిసార్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి బుధవారం నిరాకరించింది. దర్యాప్తు చురుకుగా సాగుతున్న ఈ సమయంలో నిందితురాలికి బెయిల్ ఇవ్వడం దర్యాప్తును దెబ్బతీస్తుందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది.
Sonam Raghuvanshi case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఆయన భర్త సోమన్ రఘువంశీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజా మే 23 నుంచి కనిపించకుండాపోయారు.
King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ […]