Venu Goapl Reddy
Author- NTV Telugu-
LPG Crisis: ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..
LPG Crisis: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా భారత్‌లో LPG కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు(మంగళవారం) పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. -
Dhurandhar 2: “ధురంధర్” కోసం ఫిన్లాండ్ దేశాధినేత ఎదురుచూపులు..
Dhurandhar 2: ‘‘ధురంధర్’’ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. పాకిస్తాన్లో ఇండియన్ స్పై డ్రామాగా తెరకెక్కిన ధురంధర బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. నిషేధం విధించినప్పటికీ పాకిస్తాన్ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారు. అయితే, ఇప్పుడు ‘‘ధురంధర్-2’’ మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాలో యూరప్ దేశమైన ఫిన్లాండ్ దేశాధినేత ఉండటం గమనార్హం. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రస్తుతం రణవీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ […] -
Iran Ship Attack: ఇరాన్ యుద్ధనౌక దాడిలో “విషాద కోణం”.. కమాండర్ మొండితనానికి 87 మంది బలి..
Iran Ship Attack: ఇరాన్ యుద్ధం వేళ, శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి టార్పిడో దాడి చేసింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖపట్నంలో మిలన్ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఐరిస్ డేనా అనే యుద్ధ నౌక సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయింది. ఈ ఘటన సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 87 మంది మరణించగా, 32 […] -
PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..
PM Modi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు ₹33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీఎంసీ రాష్ట్రపతిని అవమానించిందని ప్రధాని ఆరోపించారు. -
Uttam Nagar Tarun Case: తరుణ్‌ను చంపిన నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్..
Uttam Nagar Tarun Case: ఢిల్లీలో ఉత్తమ్ నగర్ ఘటన దేశవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. హోలీ రోజు 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడిని పొరుగున ఉండే ముస్లిం కుటుంబం దారుణంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటనపై హిందువులు భగ్గుమంటున్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) నిందితుడు నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించాయి. నిందితుడి ఇంటి కూల్చివేత ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో […] -
China: భారత స్నేహం కోసం చైనా ఆరాటం.. వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు..
China: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్‌లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు, విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజింగ్‌లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. -
Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
Nishant Kumar: బీహార్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. ఆదివారం 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఈ రోజు అధికారికంగా జేడీయూలో చేరారు. రెండు దశాబ్ధాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. -
Flipkart lays off: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్.. వందలాది ఉద్యోగాలు ఖతం..
Flipkart lays off: వరసగా టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఏఐ విస్తరిస్తుండటంతో కంపెనీలు దీనిపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ ద్వారా ఉద్యోగుల్ని రీప్లేస్ చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు, ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునే ప్రయత్నంలో సంస్థలు ఉన్నాయి. -
Iran War: “ట్రంప్‌ను వదిలిపెట్టం, మూల్యం చెల్లించుకోవాల్సిందే”.. ఇరాన్ బిగ్ వార్నింగ్..
Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ‘‘ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదు’’ అని వార్నింగ్ ఇచ్చింది. తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపినందుకు అమెరికా అధ్యక్షుడు ‘‘మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడుల్లో ఖమేనీ మరణించారు. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైంది. -
Iran War: “యురేనియం” టార్గెట్‌గా యూఎస్-ఇజ్రాయిల్ ప్లాన్.. ఇరాన్‌లోకి స్పెషల్ ఫోర్సెస్.!
Iran War: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొత్త టర్న్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోకి ప్రత్యేక దళాలను పంపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాలని ఇజ్రాయిల్, యూఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్లో ఎన్రిచ్ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ సైనిక ఎంపిక గురించి చర్చించడం ప్రారంభించాయి. ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల 60 శాతం ఎన్రిచ్ యురేనియం స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!