Air India Plane Crash: 100 మందికి పైగా మృతి.? టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్ లాస్ట్..
- కుప్పకూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం..
- టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిన ఫ్లైట్..
- టేకాఫ్ తర్వాత సెకన్లలోనే సిగ్నల్ కట్..
- 100 మందికి పైగా ప్రయాణికులు మరణించినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానం సిగ్నల్ కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సమయంలో మధ్యాహ్నం 1.17 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని నిమిషాల్లోనే విమానం తన ఎత్తును కోల్పోయింది. వెంటనే నేలను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానం కింద పడుతున్న సమయంలో 825 అడుగుల ఎత్తులో ఉంది. గాయపడిన అనేక మంది ప్రయాణికులను ఇప్పటికే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వైద్య మరియు అగ్నిమాపక సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 100 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.
What a tragedy.
Air India flight to London crashes soon after takeoff in Ahmedabad.
Flight AI-171, a Boeing Dreamliner 787, crashed with more than 240 people on board.
One of the worst air tragedies of recent times. #planecrash pic.twitter.com/0FnMnxdvXT— Abhijit Majumder (@abhijitmajumder) June 12, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!