Donald Trump:వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా, చైనాల మధ్య ముందస్తుగా రేర్ ఎర్త్ మెటీరియల్, చైనా విద్యార్థులకు వీసాలపై డీల్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ట్రూత్ సోషల్ పోస్టులో.. బీజింగ్ అమెరికాకు అయస్కాంతాలు, కావాల్సిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరా చేస్తుందని, బదులుగా అమెరికా చైనీస్ స్టూడెంట్స్‌కి యూఎస్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. యూఎస్ 55 శాతం సుంకాలను, చైనా 10 శాతం సుంకాలను పొందుతుందని, ఈ సంబంధం అద్భుతంగా ఉందని ఆయన తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Read Also: TS Govt Schools: ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ.. ఈ విద్యా సంవత్సరం నుంచే!
మే నెలలో కీలకమై రేర్ ఎర్త్ మెటీరియల్ కారణంగా ఇరు దేశాల మధ్య సుంకాల సంధి పట్టాలు తప్పింది. దీని తర్వాత ఇరు దేశాల మళ్లీ చర్చలు ప్రారంభించాయి. దీని తర్వాత చైనా అరుదైన ఖనిజాలపై చైనా ఎగుమతి పరిమితుల్ని తొలగించడానికి అంగీకరించింది.