Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేయించింది భార్య సోనమ్ రఘువంశీ. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి, ఈ దారుణానికి తెగబడింది. ముగ్గురు కిరాయి హంతకులతో మేఘాలయలోని కాసీ హిల్స్‌లో రాజాను మర్డర్ చేశారు. మే 23న రాజా హత్య జరిగితే, జూన్ 02న పోలీసులకు అతడి మృతదేహం లభ్యమైంది. చివరకు, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీలోని ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది.
Lone survivor: ఎయిరిండియా విమానం ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన పట్ల యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. విమానం మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’పేరుతో ఇరాన్‌పై భీకరమైన వైమానిక దాడులు చేస్తో్ంది. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఉదయం నుంచి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు మరణించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణతో మరోసారి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. Read Also: Air India plane crash: విమానం చివరి క్షణాల్లో పైలట్లు ఏం చేసి ఉండొచ్చు..? […]
Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. లండన్ వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. టేకాఫ్ అయిన 33 క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఫ్లైట్ మెడికల్ హాస్టల్ పై కూలిపోవడంతో 24 మంది మెడికోలు మరణించారు. అయితే, క్షణాల్లోనే విమానం ఎలా కూలిపోయిందనే దానిపై […]
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కి రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలు పరిశోధించే ‘‘ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB) ఈ ప్రమాద దర్యాప్తులో పాల్గొనబోతోంది. భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాన్ని పంపిస్తున్నట్లు యూకే చెప్పింది.
లిఫ్ట్ అనేది విమానం రెక్కల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. ఇది విమానం పైకి వెళ్లేందుకు సహాయపడుతుంది. బరువు అనేది గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకు లాగబడుతుంది. ఇక థ్రస్ట్ విమానం ఇంజన్ల ద్వారా వస్తుంది. డ్రాగ్ అనేది విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదుర్కునే నిరోధకత. విమానం గాలిలోకి ఎగరాలంటే బరువు కన్నా లిఫ్ట్ అధికంగా ఉండాలి. డ్రాగ్ కన్నా థ్రస్ట్ అధికంగా ఉండాలి.
Ahmedabad plane crash: ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్‌లో సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది.
Vijay Rupani: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్‌తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్‌కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా పదొన్నతి […]
Bird Hit: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇలా ఎలా కూలిపోయిందనే దానిపై పలువురు వైమానిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.