Gangster Goldy Brar: ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ముఠా హతమార్చింది. 2022 మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని సొంతూరులో తన ఎస్యూవీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మూసే వాలా అక్కడిక్కడే మరణించాడు. ఆయన ప్రయానిస్తున్న కారుపైకి 100 కన్నా ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేశారు.
Ring Road Murder: సోనమ్ రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అత్యంత క్రూరంగా భర్త రాజా రఘువంశీని హత్య చేయించిన మహిళగా సమాజం ఆమెపై దుమ్మెత్తిపోస్తోంది. ప్రియుడు రాజ్ కుష్వాహా మోజులో పడిన సోనమ్, కిరాయి హంతకులతో భర్తని హత్య చేయించింది.
Honeymoon murder case: సంచలనంగా మారిన మేఘాలయ హనీమూర్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. పెళ్లయి నెల రోజులు గడవక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకువెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది.
Pakistan: ఆపరేషన్ సిందూర్ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. ముందుగా, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. అ
Sonam Raghuvanshi Case: దేశవ్యాప్తంగా సోనమ్ రఘువంశీ కేసు సంచలనంగా మారింది. హనీమూన్‌కి తీసుకెళ్లిన భర్తని అతి దారుణంగా కిరాయి హంతకులతో చంపించింది. మే 23 నుంచి కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 02న మేఘాలయలోని కాసీ హిల్స్‌లో దొరికింది. పోలీసులు రాజాది హత్యగా తేల్చారు.
S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు.
Sonam Raghuvanshi Case: రాజా రఘువంశీ హత్య, భార్య సోనమ్ రఘువంశీ దుర్మార్గం యావత్ దేశంలో సంచలనంగా మారింది. కొత్తగా పెళ్లయని జంట హనీమూన్‌కి వెళ్లింది. అక్కడే కిరాయి హంతకులతో సోనమ్ రాజాను దారుణంగా హత్య చేయించింది. పెళ్లయిన రెండు వారాల వ్యవధిలోనే భర్తను ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం కడతేర్చింది.
Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం సోనమ్ రఘువంశీ, తన భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులతో హత్య చేయించింది. మొత్తం మర్డర్ ప్లాన్‌కి సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసినట్లు తేలింది. మే 10న వివాహమైన ఈ జంట, హనీమూన్ కోసం మే 21న మేఘాలయాకు వెళ్లారు. మే 23న రాజా రఘువంశీని ఆకాష్ రాజ్‌పూత్, వికాస్ అలియాస్ విక్కీ, ఆనంద్‌లు కలిసి హత్య చేశారు.
Rajnath Singh: ఇటీవల సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్-చైర్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది.
USA: అమెరికా అధ్యక్షుడు వలసదారులను నిర్బంధించడంపై కాలిఫోర్నియా అట్టుడుకుతోంది. లాస్ ఎంజెల్స్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వందలాది మంది అరెస్టులు జరిగాయి. మరోవైపు, నిరసనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ లక్ష్యంగా లూటీలు చేస్తున్నారు.