UPI payments: “యూపీఐ లావాదేవీల”పై తప్పుడు ప్రచారం.. కేంద్రం సీరియస్ వార్నింగ్..
- యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం..
- ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు..
- అంతా వట్టిదే అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI payments: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని చిన్న షాపుల్లో పేమెంట్స్‌కి కూడా గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపీఐ ఆధారిత యాప్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూ.3000 కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమే అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
Read Also: US General: “పాకిస్తాన్ ఒక అద్భుత భాగస్వామి”.. అమెరికా నిజ స్వరూపం ఇదే..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీల విలువ ఆధారంగా ఎండీఆర్ వసూలు చేసేందుకు చర్చలు సాగుతున్నాయని పలు నివేదికలు వెలువడ్డాయి. అధిక విలువైన డిజిటల్ పేమెంట్స్ నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని సూచించాయి.
ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కేంద్రం సీరియస్‌గా స్పందించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ప్రజలకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రచారం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజల్లో అనవసరమైన అనిశ్చితి, భయాందోళనకు కారణమవుతున్నారని ఎక్స్‌లో మండిపడింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!