USA: అమెరికా అధ్యక్షుడు వలసదారులను నిర్బంధించడంపై కాలిఫోర్నియా అట్టుడుకుతోంది. లాస్ ఎంజెల్స్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వందలాది మంది అరెస్టులు జరిగాయి. మరోవైపు, నిరసనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ లక్ష్యంగా లూటీలు చేస్తున్నారు.
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన భర్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారునంగా హత్య చేయించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోనమ్ తన భర్తని చంపేందుకు కిరాయి హంతకులకు రూ. 4 లక్షల ఆఫర్ చేసిందని, ఆ తర్వాత మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు విచారణలో వెల్లడైంది. భర్త మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనమ్ నిందితులకు సహాయం చేసింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్‌లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది.
Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్‌బర్గ్ ఫ్రాన్స్‌కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది" అని ఎక్స్‌లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
S Jaishankar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే భారత్ దానిని లక్ష్యంగా చేసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. ‘‘వారు ఎక్కడ ఉన్నారో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్లో ఉంటే, మేము పాకిస్తాన్లోకి వెళ్తాము’’ అని అన్నారు.
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్తతో కలిసి మేఘాలయ హానీమూన్‌కి వెళ్లిన భార్య, అతడిని దారుణంగా హత్య చేయించింది. రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ రఘువంశీ కిరాయి హంతకులతో హతమార్చింది. సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు కలిసి ఈ మొత్తం హత్యను ప్లాన్ చేశారు. మే 23న హత్య జరిగితే, జూన్ 2న మేఘాలయాలోని కొండల్లో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణలో […]
UN report: 2025 నాటికి భారతదేశ జనాభా 1.46 బిలియన్లకు (146 కోట్లు)కు చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా నివేదిక పేర్కొంది. అయితే, దేశంలో సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేటు కన్నా తగ్గుతోందని వెల్లడించింది. UNFPA యొక్క 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (SOWP) నివేదిక, ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్, సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనల నుంచి పునరుత్పత్తి లక్ష్యాలను పరిష్కరించడం వైపు మారాలని పిలుపునిచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన […]
Austria school shooting: యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్లోని ఒక స్కూల్లో జరిపిన కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడు విద్యార్థి అని తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడు వాష్ రూంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడని ఆస్ట్రియన్ స్టేట్ మీడియా ఓఆర్ఎఫ్ని ఉటంకిస్తూ యూకేకి చెందిన ఇండిపెండెంట్ నివేదించింది. అయితే, అధికారుల నుంచి ఇంకా ధ్రువీకరణ రావాల్సి ఉంది. Read Also: […]
US Embassy: అమెరికాలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థికి అక్కడి అధికారులు చేతికి సంకెళ్లు వేసి, బహిష్కరించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అమెరికా తీరును ప్రవాస భారతీయులతో పాటు, దేశంలోని ప్రజలు ఖండించారు. అయితే, ఈ ఘటనపై భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.