Fog Warning: వాహనదారులకు అలర్ట్.. పొగ మంచు హెచ్చరికలు జారీ.. ఆ తర్వాతే బయల్దేరండి..
- ఏపీలో పొగ మంచు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..
- ఉదయం 8 గంటల వరకు పొగ మంచు తీవ్రత ఉంటుంది..
- 8 గంటల తర్వాత ప్రయాణాలు చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fog Warning: సంక్రాంతి సంబరాలు ముగిసాయి.. మరోవైపు, సెలవులు కూడా ముగియడంతో.. పండుగకు సొంత ఊరు వెళ్లినవారు.. అంతా.. హైదరాబాద్, బెంగళూరు.. ఇలా వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.. దీంతో, విజయవాడ-హైదరాబాద్ హైవే రద్దీగా మారింది.. అయితే, ఈ సమయంలో.. వాహనదారులకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని, ఆ తర్వాతే వాహనదారులు ప్రయాణాలు చేయాలని సూచించింది.
Read Also: Harsha Vardhan : దొంగ మనసు మార్చేకన్నా ఇంటికి తాళం వేయడం బెటర్.. అనసూయకి హర్షవర్ధన్ కౌంటర్!
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో దృశ్యమానత తగ్గడంతో రహదారులపై ప్రమాదాల ముప్పు ఉందని హెచ్చరించింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణాలు చేస్తున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వేగం తగ్గించి వాహనాలు నడపాలని, హెడ్‌లైట్స్ ఆన్‌లో ఉంచుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా పొగమంచు పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపింది. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపైకి రావాలని సూచించింది. పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు ప్రారంభించడం సురక్షితమని, వాహనదారులు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని వాతావరణ శాఖ కోరింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!