AP Crime: ప్లాన్ చేసి ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త.. పిల్లల ఫిర్యాదుతో వెలుగులోకి షాకింగ్ ఘటన..
- అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను హత్య చేసిన భర్త..
- కృష్ణా జిల్లా పెనమలూరులో ఘటన..
- గత ఏడాది మే 19 న భార్యను హత్య చేసిన భర్త..
- పిల్లల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో జరిగిన ఓ హత్య కేసు తొమ్మిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను హత్య చేసిన భర్త, సహజ మరణంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను మోసం చేసిన దారుణ ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి (46) దంపతులు. వీరికి కుమారుడు నగేష్, కుమార్తె తేజశ్రీ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుండగా, కుమార్తె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. రేణుకాదేవి పోరంకిలో బ్యూటిషన్‌గా పని చేస్తూ, ఆకునూరు ఝాన్సీ ఇంటికి వెళ్లి సేవలు అందించేది. ఈ పరిచయం క్రమంగా ప్రసాద్ చౌదరి, ఝాన్సీ మధ్య అక్రమ సంబంధంగా మారింది.
Read Also: Return Rush to Hyderabad: హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు.. రద్దీగా మారిన హైవేలు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ అక్రమ సంబంధానికి భార్య రేణుకాదేవి అడ్డు వస్తోందని భావించిన ప్రసాద్ చౌదరి, ఝాన్సీతో కలిసి ఆమెను తొలగించేందుకు పథకం వేశారు. గత ఏడాది మే 18వ తేదీ రాత్రి రేణుకాదేవి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులను ప్రసాద్ నమ్మించాడు. మరుసటి రోజు మే 19న ఆమె మృతి సహజమేనని చెప్పి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే, తొమ్మిది నెలల తర్వాత కుమారుడు నగేష్‌కు తల్లి సెల్‌ఫోన్‌లో ఉన్న కాల్ రికార్డింగ్‌లు, ఫోన్ సంభాషణలు లభించాయి. వాటిలో తల్లి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఉండటంతో కుమారుడు, కుమార్తె మీడియా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం ఇది హత్యేనని నిర్ధారించారు. ఈ నెల 13వ తేదీన ప్రసాద్ చౌదరి, ఆకునూరు ఝాన్సీలను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల ధైర్యం, ఆధారాల వల్ల తొమ్మిది నెలల తర్వాత బయటపడ్డ ఈ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు