Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని అందించాలని కోరుకుంటోంది.
GST: ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. అయితే, విమానం గాలిలో ఉండగానే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా.?? అని పరిశోధకులు, విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. విమానం కూలిపోయే సమయంలో ల్యాండింగ్ గేర్ బయటకు ఉండటం, రెక్కల్లోని ప్లాప్స్ ఉపసంహరించుకుని ఉండటం ప్రమాద విజువల్స్‌లో కనిపించాయి.
Parliament breach: డిసెంబర్ 13, 2023న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన నీలం ఆజాద్,మహేష్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు ఒక్కొక్కరూ రూ. 50,000 బెయిల్ బాండ్, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతుల్లో భాగంగా నిందితులు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా కేసుకు సంబంధించిన ఏదైనా బహిరంగ ప్రకటన చేయకుండా కోర్టు నిషేధించింది.
Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు.
Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్‌తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Covid Vaccine: కరోనా తర్వాత కొందరు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు దేశంలో రికార్డ్ అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ల వల్లే మరణాలు సంభవించాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), AIIMS నిర్వహించిన విస్తృతమైన అధ్యయనాలు చెక్ పెట్టాయి. కరోనా వ్యాక్సిన్లకు ఆకస్మిక అకాల మరణాలకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యయనం వెల్లడించింది. దేశంలో 40 ఏళ్ల లోపు పెద్దలకు గుండెపోటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ వెలువడింది.
Donald Trump: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు.
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు.
Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.