Gender Change: తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి ‘‘లింగ మార్పిడి’’ చేసుకున్నాడు. అంతా బాగుంది కానీ, ఇప్పుడు ఆ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి తన లవర్ కోసం సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. అత్యాచారం, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ గురువారం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
Pakistan: భారత్ దెబ్బకు పాకిస్తాన్ చైనా ఆయుధాలు, పరికరాలను నమ్మలేకపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత్ స్వదేశీ తయారీ ‘‘ఆకాష్ ఎయిర్ డిఫెన్స్’’ సిస్టమ్‌తో పాటు డ్రోన్ల అడ్డుకునే ఆయుధాలు సమర్థవంతంగా, 100 శాతం ఖచ్చితత్వంతో పనిచేశాయి.
Report: భారతదేశంలో 2019-21 జనాభా ఆరోగ్య సర్వే ప్రకారం, 13 శాతం మంది పిల్లలు నెలలు నిండకముందే జన్మించారని, 17 శాతం మంది పుట్టిన సమయంలో తక్కువ బరువు ఉన్నారని తేలింది. వాయు కాలుష్యం పిల్లల జననాలను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.
Disha Salian Case: మాజీ సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుని మరణించిందని, ఆమె మరణంలో ఎలాంటి తప్పు కనుగొనబడలేదని ముంబై పోలీసులు బాంబే హైకోర్టుకు సమర్పించారు. ఇటీవల, దిశ తండ్రి ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని, హత్య చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల ప్రకటన ఆసక్తికరంగా మారింది.
Akash system: భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతీ ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తోంది. భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ఆయుధ మార్కెట్లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనేందుకు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
Dalai Lama: దలైలామా ఉనికి లేకుండా చేసేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మక గురువు దలైలామాకు తప్పా తన వారసుడిని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భారత్ చెప్పింది.
Covishield: కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న కొందరు అకాస్మత్తుగా మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లు, వ్యాక్సిన్ల వల్ల మరణాలు సంభవించలేదని తేల్చారు.
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో, ఎంఐఎం పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇండియా కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మమ్మీ, మమ్మీ వాళ్లు మన చాక్లెట్ దొంగిలిచారు అని ఎన్నికల తర్వాత ఎవరూ ఏడవకూడదు.’’ అని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో చేరాలని భావిస్తున్నారా.?? అని ఓవైసీని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
F-35B Fighter: ప్రపంచంలో అత్యుత్తమ ఫైటర్ జెట్‌గా చెప్పబడుతున్న అమెరికన్ తయారీ ఎఫ్-35 బీ కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. సాంకేతిక కారణాలతో బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ విమానం గత కొన్ని రోజులుగా ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతోంది. రుతుపవనాలు విస్తరించడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదుల, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గల్లంతయ్యారు.