Air India Plane Crash: రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా..? ఫ్లైట్ సిమ్యులేషన్‌లో కీలక ఫలితాలు..
- ఎయిరిండియా ఘటనకు రెండు ఇంజన్ల ఫెయిల్యూర్ కారణమా..?
- ఇంజన్ వైఫల్యాన్ని సూచిస్తున్న ఫ్లైట్ సిమ్యులేషన్ ఫలితాలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. అయితే, విమానం గాలిలో ఉండగానే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా.?? అని పరిశోధకులు, విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. విమానం కూలిపోయే సమయంలో ల్యాండింగ్ గేర్ బయటకు ఉండటం, రెక్కల్లోని ప్లాప్స్ ఉపసంహరించుకుని ఉండటం ప్రమాద విజువల్స్‌లో కనిపించాయి. అయితే, ఇదే పరిస్థితులను ఫ్లైట్ సిమ్యులేటషన్‌లో ప్రదర్శించారు. అయితే, ఈ రకంగా ఉన్న సెట్టింగ్స్ మాత్రమే ప్రమాదానికి కారణం కాదని దర్యాప్తు గురించి తెలిసిన కొంత మంది చెప్పారు. బహుశా రెండు ఇంజన్ల వైఫల్యం ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
ఎమర్జెన్సీ పవర్ టర్బైన్ కూడా ఢీకొనడానికి కొన్ని సెకన్ల ముందు బయటకు వచ్చిందని తేలింది. దీనిని బట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం కూడా ఒక సాధ్యమయ్యే కారణంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB నేతృత్వంలోని అధికారిక దర్యాప్తు నుండి విడిగా సిమ్యులేట్ ఫ్లైట్ నిర్వహించబడింది, ప్రమాదానికి సాధ్యమయ్యే సీన్లను క్రియేట్ చేస్తున్నారు. జూన్ 12 కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన రెండు ఇంజన్లతో నడిచింది. అయితే, టేకాఫ్ అయ్యే సమయంలో మాత్రం కావాల్సిన శక్తి అందుకోలేన్లు అనిపించింది.
Also Read
Read Also: Xi Jin ping: అధ్యక్షుడు జిన్‌పింగ్ మిస్సింగ్.. చైనాలో కలకలం
అయితే, బోయింగ్ ఇప్పటి వరకు దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. దర్యాప్తుపై ఇప్పుడేం వ్యాఖ్యానించలేమని జనరల్ ఎలక్ట్రిక్ కూడా చెప్పింది. రెండు ఇంజన్లు ఒకేసారి శక్తిని కోల్పోయో లేదో తెలియదు.అయితే, పరిశోధకులు రెండు ఫ్లైట్ రికార్డర్ల నుంచి మరింత సమాచారం వస్తుందని చూస్తున్నారు. ప్రమాద సమయంలో, విమానం ల్యాండింగ్ గేర్ కొద్దిగా ముందుకు వంగి ఉంది, ఇది ల్యాండింగ్ గేర్‌ని వాపస్ తీసుకునే స్థితిలో ఉన్నట్లు సూచిస్తోంది. అదే సమయంలో ల్యాండింగ్ గేర్ తలుపులు తెరుచుకోలేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే విమానంలో ఎలక్ట్రిసిటీ లేదా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
విద్యుత్ వైఫల్యం సంభవించినప్పుడు విమానం నుంచి RAT అని పిలువబడే అత్యవసర టర్బైన్, విమానం కూలిపోయే ముందు ఇది యాక్టివేట్ అయింది. ఇది అత్యవసర వ్యవస్థలకు విద్యుత్ అందిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ వైఫల్యం కలిగి ఉండొచ్చని, ఇంజన్లు పనిచేయకుండా ఉండొచ్చని సందేహిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?