Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
High Court: 2015లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాలిక చేయి పట్టుకుని ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పినందుకు నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడి తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది సోనాలి ఖోబ్రగడే సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలు చేశారు. లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో […]
India-US trade deal: ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అమెరికాకు చెందిన నేతలు మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని చెబుతున్నారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా, కొన్ని రంగాల్లోకి అమెరికాను అనుమతించేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ఇండియాపై ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గడం లేదు. దీంతో, పరస్పర సుంకాల అమలులోకి రావడానికి జూలై 09 తుది గడువుగా ఉన్నప్పటికీ, ఆలోపు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం కష్టంగానే కనిపిస్తోంది.
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను నిషేధిస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని ఆరోపించారు.చట్టపరిధిలో ఆ సంస్థ పనిచేయడం లేదని అన్నారు.
SC-ST reservation: చరిత్రలో మొదటిసారిగా, భారత సుప్రీంకోర్టు, తన సిబ్బంది నియామకాలు, ప్రమోషన్ల విషయంలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని అధికారికంగా అమలు చేసింది. జూన్ 24, 2025 నాటి ఇంటర్నల్ సర్క్యులర్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తు్న్నట్లు ప్రకటించింది. ఇది దేశ అత్యున్నత న్యాయ సంస్థలో నియామకాలు, ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు.
Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక జూలై 11 నాటికి విడుదల కానుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. నేలపై ఉన్న మరో 34 మంది చనిపోయారు. వచ్చే వారం విడుదల కాబోయే ప్రాథమిక రిపోర్టు కీలకంగా మారబోతోంది. 4-5 పేజీల నిడివి ఉంటుందని భావిస్తున్న ఈ డాక్యుమెంట్లో ప్రమాదానికి సాధ్యమయ్యే కారణాలతో సహా అనేక కీలక విషయాలు ఉండనున్నాయి.
Congress: ముఖ్యమంత్రి మార్పు, ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితి సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్‌గా మారింది. తర్వలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తుంటే, మరికొందరు సిద్ధరామయ్యే మా సీఎం అని చెబుతున్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది.
Fake Student: ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.