Parliament breach: పార్లమెంట్‌లో దాడి చేసిన నిందితులకు బెయిల్..
- పార్లమెంట్‌లో దాడి స్మోక్ డబ్బాలతో దాడి చేసిన నిందితులకు బెయిల్..
- డిసెంబర్ 13, 2023లో పార్లమెంట్ సెక్యూరిటీ ఉల్లంఘన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament breach: డిసెంబర్ 13, 2023న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన నీలం ఆజాద్,మహేష్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు ఒక్కొక్కరూ రూ. 50,000 బెయిల్ బాండ్, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతుల్లో భాగంగా నిందితులు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా కేసుకు సంబంధించిన ఏదైనా బహిరంగ ప్రకటన చేయకుండా కోర్టు నిషేధించింది. సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు చేయవద్దని హెచ్చరించింది. ఇంతే కాకుండా నిందితులు ఢిల్లీ నగరం విడిచి వెళ్లకుండా కోర్టు ఆంక్షలు విధించింది. ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటలకు నిర్ణీత పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Annamalai: అన్నామలైపై క్రిమినల్ కేసు.. వివాదంగా పవన్ కళ్యాణ్ హాజరైన సభ..
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
సంచలనంగా మారిన కేసు:
డిసెంబర్ 13, 2023లో ఆరుగురు వ్యక్తులు పార్లమెంట్ సెక్యూరిటీని దాటుకుని, పార్లమెంట్ హాలులోకి ప్రవేశించారు. జీరో అవర్ సమయంలో వారు పబ్లిక్ గ్యాలరీల నుంచి దూకి, పసుపు రంగులో ఉన్న వాయువును విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్‌లో గందరగోళం ఏర్పడింది. ఎంపీలు భయపడిపోయారు. ఆరుగురు నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ డి లోక్‌సభ హాలులోకి చొరబడ్డారు.
డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి రోజే, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. పార్లమెంట్ లోపల ఇద్దరు నిందితులు పొగ డబ్బాలతో హల్చల్ చేయగా.. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల హంగామా చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఉల్లంఘన జరిగిందని నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింసపై తాము కలత చెందామని నలుగురు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాలపై చట్టసభ సభ్యలు చర్చించడానికి వారి దృష్టిని ఆకర్షించేందుకు రంగు పొగను ఉపయోగించామని విచారణలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!