Quad: భారత్‌కు దౌత్య విజయం.. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు..
- భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం..
- పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ కూటమి..
- ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఆస్త్రేలియా, అమెరికా, జపాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. ఉగ్రదాడి నేరస్తులు, నిర్వాహకులు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో జరిగిన సంయుక్త ప్రకటనలో.. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
‘‘పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని, నిర్వాహకులను, ఆర్థిక సహాయం చేసిన వారిని ఎటువంటి ఆలస్యం లేకుండా న్యాయం ముందు నిలబెట్టాలి. అంతర్జాతీయ చట్టం, సంబంధిత UNSCRల ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా, ఈ విషయంలో అన్ని సంబంధిత అధికారులతో చురుకుగా సహకరించాలని అన్ని UN సభ్య దేశాలను కోరుతున్నాము’’ అని ప్రకటన పేర్కొంది.
ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ప్రపంచ సమస్యలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై ప్రపంచం ‘‘జీరో టాలరెన్స్’’తో ఉండాలని, బాధితులను, నేరస్తులను ఎప్పుడూ సమానం చూడొద్దని, ఉగ్రవాదం నుంచి తమ పౌరుల్ని రక్షించుకునే బాధ్యత భారత్‌కు ఉందని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..