Donald Trump: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు. ‘‘భారతదేశంతో మనం ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని నేను అనుకుంటున్నాను. అది వేరే రకమైన ఒప్పందం అవుతుంది. మనం భారత్ లోపలికి వెళ్లి పోటీ పడగలిగే ఒప్పందం ఇది అవుతుంది. ప్రస్తుతం, భారతదేశం ఎవరినీ అంగీకరించదు. భారతదేశం అలా చేయబోతోందని నేను భావిస్తున్నాను, వారు అలా చేస్తే, చాలా తక్కువ సుంకాలకు ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ చెప్పారు.
Read Also: Adivi Sesh : ఆ కారణంగానే ‘డెకాయిట్’ నుండి శ్రుతి హాసన్ తప్పుకుంది..
సుంకాల పెంపు, పరస్పర సుంకాల గడువు జూలై 09తో ముగియబోతున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పటికీ, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలు జరుపుతున్నాయి. చర్చలు చివరి క్షణాలకు చేరుకున్నాయి. అయితే, భారత్ పాడిపరిశ్రమ, వ్యవసాయం విషయంలో దృఢంగా వ్యవహరిస్తోంది. ఈ రంగాల్లోకి అమెరికాను అడ్డుకుంటోంది. మరోవైపు, ఆపిల్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటల వంటి వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు కోసం అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఒక వేళ చర్యలు విఫలమైతే తిరిగి 26 శాతం సుంకాల విధింపు అమలు చేయడానికి దారితీస్తుంది.