Covid Vaccine: కరోనా తర్వాత కొందరు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు దేశంలో రికార్డ్ అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ల వల్లే మరణాలు సంభవించాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), AIIMS నిర్వహించిన విస్తృతమైన అధ్యయనాలు చెక్ పెట్టాయి. కరోనా వ్యాక్సిన్లకు ఆకస్మిక అకాల మరణాలకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యయనం వెల్లడించింది. దేశంలో 40 ఏళ్ల లోపు పెద్దలకు గుండెపోటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ వెలువడింది.
Read Also: ENG vs IND: నేటి నుంచే రెండో టెస్టు.. సందిగ్ధంలో భారత్! కలిసిరాని ఎడ్జ్‌బాస్టన్
కోవిడ్-19 వ్యాక్సిన్లు, యువకులకు గుండెపోటు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ అధ్యయనం ఫలితాల్లో జీవనశైలి, ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు మరణాలకు కీలకమైన కారకాలుగా గుర్తించారు. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య గల యువతో ఆకస్మిక మరణాల వెనక గల కారణాలను అధ్యయనం చేయడానికి ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కలిసి పనిచేస్తున్నాయి.