RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య […]
Jai Shankar: జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
Air India Plane Crash: గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో పాటు, నేలపై ఉన్న 34 మంది వ్యక్తులు మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన 30 సెక్షన్లలోపే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 181 మంది భారతీయులు మరణించగా, 52 మంది యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు చెందిన వారు ఉన్నారు.
Ukraine War: రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడి ప్రారంభించింది. ఈ దాడుల్లో ఒక ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా మొత్తం 537 వైమానిక ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయి. అయితే, వీటిలో 249ని కూల్చేసినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామ్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజల ప్రాణాలకు అవసరమయ్యే అన్నింటిని రష్యా టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో ఆరోపించారు. […]
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31)కు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్‌తో సంబంధం ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు క్యాంపస్ సెక్యూరిటీ గార్డును కూడా అరెస్ట్ చేశారు.
Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Air India flight: టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI357 విమానంలో ప్రయాణికులు, సిబ్బంది క్యాబిన్ లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగడం లేదు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, ఆ దేశంలో మతోన్మాదులకు, ఉగ్రవాదులకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ అరాచకాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థల నేతలు చెలరేగిపోతున్నారు.