Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
Read Also: High Court: అమ్మాయికి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పినంత మాత్రాన ‘‘లైంగిక’’ ఉద్దేశం ఉన్నట్లు కాదు..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీవ్రమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. పహల్గామ్, బల్తాల్ నుంచి యాత్రా మార్గాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. భద్రత కోసం దాదాపు 600 అదనపు కంపెనీ పారామిలిటరీ దళాలను మోహరించారు. ఇది ఇప్పటి వరకు యాత్ర కోసం ఈ రేంజ్ లో ఎప్పుడూ భద్రతను మోహరించలేదు. మరోవైపు, ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని అధికారులు చెప్పారు. తీర్థయాత్ర సజావుగా సాగేందుకు ఆరోగ్యం, నీటి సరఫరా, విద్యుత్ వంటి కీలక విభాగాల నుంచి వందలాది మంది జమ్మూ కాశ్మీర్ ఉద్యోగులు ఇందులో పాల్గొంటారు.