Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
- iQOO నుంచి కొత్త iQOO Z11 Turbo లాంచ్
- చైనాలో అధికారికంగా విడుదల
- .59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్‌ప్లే
- 12GB + 256GB ధర 2699 యువాన్ (రూ.34,900).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11 Turbo: ఐక్యూ iQOO తన Z11 సిరీస్‌లో భాగంగా తాజా స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z11 టర్బో (iQOO Z11 Turbo)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పెసిఫికేషన్లతో గేమింగ్, పెర్ఫార్మెన్స్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను డిజైన్ చేసింది.
iQOO Z11 Turboలో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2750×1260 రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను సపోర్ట్ చేస్తుంది. TCL CSOT C9+ ల్యూమినసెంట్ మెటీరియల్‌తో తయారైన ఈ స్క్రీన్, 1 నిట్ మినిమమ్ బ్రైట్‌నెస్‌తో ఐ కంఫర్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే ఇందులో 4320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC-లైక్ డిమ్మింగ్, 3200Hz ఇన్‌స్టాంట్ టచ్ శాంప్లింగ్, 300Hz టెన్-ఫింగర్ టచ్ శాంప్లింగ్ వంటి ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మార్చనున్నాయి. అలాగే దీనికి స్కాట్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
- iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- 10,000 నిట్స్ బ్రైట్‌నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్
ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 5 (3nm) మొబైల్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించారు. దీనితో పాటు స్వదేశీగా అభివృద్ధి చేసిన Q2 ఈ-స్పోర్ట్స్ చిప్, Monster Hyper-Core Engine, Ice Dome VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్‌తో కలిసి ఈ డివైస్ AnTuTuలో 35.9 లక్షలకు పైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. హేవీ గేమింగ్‌లో కూడా 60fps సగటు ఫ్రేమ్‌రేట్, తక్కువ పవర్ వినియోగంతో స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలిపింది.

ఈ మొబైల్ టర్బో ఫ్లోటింగ్ లైట్, హలొ పింక్, స్కై వైట్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. మిడ్‌నైట్ బ్లాక్ వెర్షన్‌లో ఫైబర్‌గ్లాస్ బ్యాక్, మిగతా వేరియంట్లలో గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. అలాగే అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో పాటు IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో iQOO తొలిసారిగా 200MP మెయిన్ కెమెరాను అందించింది. ఇది పెద్ద సెన్సార్‌తో పాటు 4x లాస్‌లెస్ జూమ్, ఫుల్ ఫోకల్ లెంగ్త్ పోర్ట్రెయిట్ (50mm, 85mm) సపోర్ట్ చేస్తుంది. ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 0.8x వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది.
Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
వీటితో పాటు ఇందులో 7600mAh భారీ బ్యాటరీ ఉంది. రెండో తరం సెమీ సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో ఇది -20°C నుంచి 40°C వరకు స్థిరమైన పనితీరును ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, గేమింగ్ సమయంలోనూ వేడి లేకుండా ఛార్జ్ చేసే డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై 2.0 సపోర్ట్ కూడా ఉంది. చైనాలో iQOO Z11 Turbo ధరలు చైనాలో 12GB + 256GB – 2699 యువాన్ (రూ.34,900) నుండి 16GB + 1TB – 3999 యువాన్ మధ్య విరివిధా వేరియంట్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ జనవరి 15 నుంచి చైనాలో అమ్మకాలకు అందుబాటులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్‌నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!