Dalai Lama: దలైలామా విషయంలో భారత్, చైనాల మధ్య వివాదం నెలకొంది. దలైలామా తన వారసుడిని తానే నిర్ణయించుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై శుక్రవారం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై దీని ప్రభావాన్ని నివారించడానికి టిబెట్ సంబంధిత విషయాల్లో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ కోరింది.
Pakistan: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా అనేక కారణాలతో పాకిస్తాన్ సతమవుతోంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్లో కొద్దోగొప్పో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను మూసేస్తున్నాయి. టెక్ దిగ్గజం ‘‘మైక్రోసాఫ్ట్’’ జూలై 3, 2025 నుంచి పాకిస్తాన్ నుంచి నిష్క్రమించింది.
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు.
Indian Army: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో మాత్రమే కాకుండా మొత్తం ముగ్గురు శత్రువలతో పోరాడామని మిలిటరీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(కాపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టెన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ అన్నారు. ఇటీవల, పాకిస్తాన్‌తో జరిగిన ఉద్రిక్తత గురించి వివరణ ఇచ్చారు.
Crime: పోలీసుగా నటిస్తూ మహిళల్ని మోసం చేస్తున్న వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్‌గా నటిస్తూ, నౌషద్ త్యాగి అనే వ్యక్తి తన పేరును రాహుల్ త్యాగిగా మార్చుకుని మహిళల్ని టార్గెట్ చేస్తున్నాడు. గత మూడేళ్లలో అనేక రాష్ట్రాల్లో మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. త్యాగి నకిలీ పోలీసు యూనిఫాం ధరించి మహిళల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కానిస్టేబుల్ అని నటించేవాడు.
Indian defence: రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది.
UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని ఓ వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. భార్య 5 నెలల గర్భిణి అని చూడకుండా దాడి చేశాడు. దీంతో ఆమె ఇంటి పైకప్పు నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలోని నాగ్డా ధాక్ గ్రామంలో జరిగింది. బుధవారం సాయంత్రం, మృతురాలు వండి ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉందనే కారణంగా గొడవజరిగింది. ఈ గొడవ కారణంగా బ్రజ్‌బాలా(25) తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Delhi Vehicle Policy:ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన వెహికిల్ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంది. 15 ఏళ్ల కన్నా పాతవైన పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్ల కన్నా పాతవైన డీజిల్ వాహనాలకు ఇంధనం ఇవ్వద్దని ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. పాత వాహనాల నిషేధాన్ని నిలిపివేస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ దాడికి ప్రతిస్పందించడానికి తమకు కేవలం 30-45 సెకన్ల టైమ్ మాత్రమే ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహాయకుడు రాణా సనావుల్లా అన్నారు. బ్రహ్మోస్ క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉంటుందో లేదో తెలుసుకునేందుకు తక్కువ సమయం ఉన్నట్లు ఆయన అంగీకరించారు.