Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్‌తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Read Also: Vishvambhara : మొత్తానికి ‘విశ్వంభర’ పై మౌనం వీడిన దర్శకుడు వశిష్ట..
బాలికను తీవ్రంగా కొడుతున్న వీడియో తల్లి చూడటంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన కుమార్తెపై దాడి చేస్తున్నట్లు అందులో ఉంది. తండ్రి బాలిక కాళ్లను కట్టి, ఆమెపై దాడి చేసి, సిగరేట్‌తో ఆమె చెంపపై కాల్చినట్లు కనిపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను రెస్క్యూ చేసేందుకు ఇంటికి వెళ్లారు. బాలిక టైంకు నిద్రపోకపోవడంతో తనను హింసించినట్లు తండ్రి చెప్పాడు.