Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. పుతిన్‌తో తాను చాలా అసంతృప్తితో ఉన్నారనని, ఆయన ప్రజలను చంపాలనుకుంటూనే ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, పుతిన్ ఫోన్ కాల్ పట్ల నేను చాలా అసంతృప్తితో ఉన్నానని, ఆయన ప్రజల్ని చంపుతూనే వెళ్లాలని అనుకుంటున్నారని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో అన్నారు.
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.
Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో భాషగా తీసుకురావడాన్ని వీరిద్దరు వ్యతిరేకించారు. అయితే,…
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్‌ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. చివరకు, పెళ్లి చేసుకుందామంటేనే యువకులు భయపడే స్థాయికి చేరింది. ఇటీవల, సోనమ్ ఘటన, గద్వాల్ తేజేశ్వర్ ఘటనలు భయపెడుతున్నాయి.
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.