Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
12 ఏళ్లలో తొలిసారి జిన్ పింగ్ బ్రిక్స్ సమ్మిట్‌కి హాజరుకాలేదు. జూలై 6-7ల్లో బ్రెజిల్‌లో ఈ సమావేశాలకు జరుగుతున్నాయి. జిన్ పింగ్‌కు బదులుడా ప్రీమియర్ లి కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో లింక్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటుండగా, భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్నారు.
Read Also: Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్
ఈ పరిణామాల గురించి యూఎస్-చైనా సంబంధాలను అధ్యయనం చేసే నిపుణుడు గోర్డాన్ చాంగ్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్ గైర్హాజరు చైనాలో రాజకీయ నిచ్చెనలో సమస్యల్ని ప్రతిబింబిస్తోందని, చైనాలో జిన్‌పింగ్ క్రమంగా ప్రభావాన్ని కోల్పోవడాన్ని సూచిస్తోందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే, జిన్‌పింగ్ గైర్హాజరు కేవలం షెడ్యూల్ సెట్ కాకపోవడం వల్లే అని, ఈ ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ఆయన భేటీ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
2009లో బ్రెజిల్ , రష్యా, చైనా, ఇండియాలో బ్రిక్స్ ఏర్పడింది. ఆ తర్వాత 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలో చేరింది. ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఈ కూటమిలో చేరాయి.