Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రధానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా మోడీకి ఈ పురస్కారాన్ని అందించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి దేశమైన నమీబియాలో ప్రధాని పర్యటిస్తున్నారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు ‘‘గుండెపోటు’’ భయం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆకస్మిక గుండెపోటు కారణాలతో మరణించారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలివస్తున్నారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్‌ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్‌హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్ కాంబాట్‌లో ఒక పురోగతిగా అభివర్ణించారు.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు మింగుడు పడలేని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదని, కేవలం టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కి.మీ సరిహద్దు పంచుకుంటుందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనగా, దీనికి పెమా ఖండు స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, మేము చైనాతో కాదు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటున్నాము’’ అని అన్నారు.
Bombay High Court: తన భార్య వ్యభిచారానికి పాల్పడుతుందనే అనుమానంతో ఆమె కుమారుడికి డీఎన్ఏ పరీక్ష చేయించడం సరైంది కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలుడి తండ్రిని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలన్న ఫ్యామిలీ హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ఎం జోషి, జూలై 1న ఇచ్చిన తన తీర్పులో.. ‘‘డీఎన్ఏ పరీక్షను చాలా అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఆదేశించగలం. కేవలం ఒక వ్యక్తి భార్య వ్యభిచారంలో ఉందని ఆరోపించిన మాత్రాన అలా చేయలేం’’ అని…
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
MK Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులతో ముచ్చటించారు. విభజన సిద్ధాంతాలను స్వీకరించవద్దని వారిని హెచ్చరించారు. నాథూరామ్ గాడ్సే మార్గాన్ని తిరస్కరించాలని సూచించారు. ‘‘గాంధీ, అంబేద్కర్ మరియు పెరియార్ తీసుకున్న మార్గాలతో సహా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ గాడ్సే గ్రూపు మార్గాన్ని తీసుకోకూడదు’’ అని ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.