Hypersonic missiles: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..
- ‘‘ప్రాజెక్టు విష్ణు’’ పేరుతో 12 హైపర్‌సోనిక్ మిస్సైళ్లు రెడీ చేస్తున్న భారత్..
- పాకిస్తాన్, చైనాలే టార్గెట్‌గా స్వదేశీ సాంకేతికతతో మిస్సైళ్లు..
- మాక్-8 వేగంతో లక్ష్యాలను ఛేదించే సత్తా..
- ఈ తరహా క్షిపణుల్ని ఆపడం దాదాపు కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘‘ప్రాజెక్టు విష్ణు’’పై పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ‘‘హైపర్ సోనిక్ మిస్సైల్స్’’ని డెవలప్ చేస్తోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇది మొత్తం ఆసియాలోనే పవర్ బ్యాలెన్స్‌ని ఛేంజ్ చేయగలదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ET-LDHCM వంటి క్షిపణులు మాక్ 8 (సుమారు గంటకు 10,000 కి.మీ.) వేగాన్ని తాకగలవు. దీంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న అమెరికా, రష్యా, చైనా జాబితాలో చేరుతుంది.
Also Read
Read Also: Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
ప్రాజెక్టు విష్ణు కింద డీఆర్డీఓ ఏకంగా 12 రకాల హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థల్ని తయారు చేస్తోంది. ఈ 12 మిస్సైల్స్ శత్రువుల క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డగించి నాశనం చేయడంతో పాటు శత్రువులపై అటాకింగ్ మిస్సైల్స్‌గా కూడా పనిచేస్తాయి. ఈ మిస్సైళ్లు ఇంటర్‌సెప్టర్ క్షిపణులుగా పనిచేస్తాయంటే, ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంటుందని అర్థం. డీఆర్డీఓ 2030 ముందే హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్స్‌ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధిక వేగం ఉన్న ఈ మిస్సైళ్లను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.
ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు- అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఈ సాంకేతికత ఉంది. భారత్ చేపట్టిన ప్రాజెక్టు కింద డెవలప్ చేస్తున్న మిస్సైల్స్ 1000 నుంచి 2000 కి.మీ బరువు ఉన్న సాంప్రదాయ లేదా అణు వార్ హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?