MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSVG : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి రిలీజై, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. పండుగ పూట చిరంజీవి మార్క్ వినోదం తోడవ్వడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే ₹200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మెగాస్టార్ స్టామినాను నిరూపించింది. ‘బుక్ మై షో’లో ఈ చిత్రం అత్యంత వేగంగా 20 లక్షల టికెట్ల సేల్స్ సాధించిన రీజనల్ సినిమాగా రికార్డు సృష్టించింది.
READ ALSO: India 5G Users: వామ్మో ఇలా వాడేస్తున్నారేంట్రా.. 5G సేవల్లో భారత్ రెండోస్థానం.. అంచనాలకు మించి..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
నాలుగో రోజు కలెక్షన్లు మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క గురువారమే దాదాపు 4.24 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అనిల్ రావిపూడి కథనంలో వినోదం, ఎమోషన్స్ సమపాళ్లలో ఉండటంతో సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. అదనపు షోలు, మరిన్ని స్క్రీన్లు పెంచినప్పటికీ, చాలా చోట్ల ‘హౌస్‌ఫుల్’ బోర్డులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనుమ రోజున అన్ని ఏరియాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్, నయనతార నటన సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. లాంగ్ వీకెండ్ ముగిసినా, సినిమా జోరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరిన్ని మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ ‘రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అగ్రస్థానంలో నిలుస్తోంది.
READ ALSO: Anasuya: అనసూయపై కామెంట్స్..జర్నలిస్టులు సహా 72 మందిపై కేసు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!